మరోసారి వార్తల్లోకి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. రోడ్ల పరిస్థితిపై షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-09-12T23:42:13+05:30 IST

మరోసారి వార్తల్లోకి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. రోడ్ల పరిస్థితిపై షాకింగ్ కామెంట్స్

మరోసారి వార్తల్లోకి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. రోడ్ల పరిస్థితిపై షాకింగ్ కామెంట్స్

యలమంచిలి: వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే నోటి వెంట వచ్చిన నిజాలు విని అంతా ముక్కున వేలు వేసుకున్నారు. నియోజకవర్గం‌లో రోడ్ల పరిస్థితి బాగోలేదని, ఆ రోడ్లు వేయించాలని ఓ వ్యక్తి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అవతల ఫోన్ రిసీవ్ చేసుకుకున్న ఎమ్మెల్యే కన్నబాబు రాజు సమాధానం విని ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. 


‘‘అన్ని డబ్బులన్ని పంచడానికే సరిపోతున్నాయి. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవు. అయినా అన్నీ వేయించడానికి దేవుడ్నా’’ అంటూ ఎమ్మెల్యే ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి అవాక్కయ్యారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటంతో ప్రభుత్వ పరిస్థితికి అద్ధంపడుతోంది. 



Updated Date - 2021-09-12T23:42:13+05:30 IST