నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది... ఇంక ప్రమాణాలు ఎందుకు?: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2022-07-02T17:49:52+05:30 IST

నెల్లూరు రూరల్‌లో రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ఉందంటూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పందిచారు.

నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది... ఇంక ప్రమాణాలు ఎందుకు?: కోటంరెడ్డి

అమరావతి: నెల్లూరు రూరల్‌లో రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ఉందంటూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (Kotamreddy srinivasulu reddy) చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (kotamreddy Sridhar reddy) స్పందిచారు. ‘‘నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. లేదని చెప్పడం లేదు.. అలాంటప్పుడు ప్రమాణాలు ఎందుకు. టీడీపీ అధికారంలో ఉండగా.. మీతో ఉన్నారు. ఇప్పుడు మాతో ఉన్నారు... తప్పేంటి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను కొత్తగా చేయడం లేదు.. గత 22 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా..’’ అని ప్రశ్నించారు. వ్యాపారస్తులు అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటారని చెప్పుకొచ్చారు. నుడా చైర్మన్‌గా ఉన్నపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాసులురెడ్డితోనే ఉన్నారని తెలిపారు. వ్యాపారులపై చందాల పేరుతో బాదుడే బాదుడును టీడీపీ నేత ఆపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హితవుపలికారు. 

Updated Date - 2022-07-02T17:49:52+05:30 IST