Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోజాను పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!

చిత్తూరు జిల్లా: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అటు రాజకీయాలు.. ఇటు బుల్లి తెరను ఏక కాలంలో హ్యాండిల్ చేసిన డేరింగ్ లేడీగా పబ్లిక్‌లో పేరు. అయితే నియోజకవర్గానికి వస్తే మాత్రం రోజాకు అంత సీన్ లేదనే ఓ టీమ్ ఎప్పటి నుంచో లోకల్ గ్రౌండ్ వర్క్ చేస్తోందట. తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లోనూ రోజా గ్రూప్ వర్సెస్ శాంతి గ్రూప్ అనే పాలిటిక్స్ తెరపైకి రావడం చూసి పార్టీలో మళ్లీ ఏదో జరుగుతోందని కార్యకర్తలు అనుకుంటున్నట్లు సమాచారం.


సీఎం జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తుంటుంది. ఎవరైనా తక్కువ చేసినట్లు కనిపించినా.. వినిపించినా.. హైకమాండ్‌కు వేగులద్వారా క్షణాల్లో తెలిసిపోతుంటుంది. అలాంటిది పెద్దాయన జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో పెద్దోళ్లకు తెలిసే జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.


నియోజకవర్గ స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా.. ఏదైనా కార్పొరేషన్ పదవికి ఛైర్మన్ గిరి అప్పజెప్పాలంటే లోకల్ ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకోవడం సంప్రదాయంగా ఉంటోంది. అలాంటిది నగరిలో ఎమ్మెల్యే రోజా ఉన్నప్పటికీ ఆమెతో ఏ మాత్రం పొసగని.. పైగా ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లోపనిచేసినట్లు ఆరోపణలు ఉన్న కేజే కుమార్‌ను తాజాగా హై కమాండ్ ప్రొత్సహిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకల్ పాలిటిక్స్‌లో పట్టున్న కేజే కుమార్, ఆయన భార్య శాంతి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. మొదటి నుంచి కేజే కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్‌కు దగ్గర మనిషిగా పనిచేస్తున్నారు. శాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టు ఇచ్చినప్పుడే రోజాకు వైసీపీలో టైమ్ దగ్గరపడిందనే ప్రచారం స్థానికంగా మొదలైందట. తాజాగా వైఎస్సార్ జయంతి రోజున రోజాతో కలిసి నడవకుండా పార్టీలో గ్రూపులు ఉన్నట్లు హైకమాండ్ మరోసారి గుర్తించేట్లు సొంత వర్గంతో కేజే కుమార్  నివాళులర్పించారు. దీంతో నగరి వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి.


Advertisement
Advertisement