Abn logo
Sep 23 2021 @ 21:04PM

కొయ్యలగూడెం వైసీపీలో ముసలం

పశ్చిమగోదావరి: జిల్లాలోని కొయ్యలగూడెం వైసీపీలో ముసలం నెలకొంది. ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నాయకులు రెండుగా చీలారు. ఇప్పటికే ఒక పదవి ఉన్న ఒక కుటుంబానికే ఎంపీపీ పదవి ఇవ్వడానికి అధిష్ఠానం సిద్ధం పడడం  ఏమిటంటూ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. మరొకరికి  ఎంపీపీ పదవి ఇవ్వాలని కొయ్యలగూడెంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు.