Abn logo
Sep 26 2021 @ 23:42PM

వైసీపీ పాలనలో దోపిడీలు, అక్రమాలు

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మందు, ఇసుక అధిక ధరలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అమ్మకాలు

వైసీపీ నేతల అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

టీడీపీ శ్రేణులకు కందుల పిలుపు


మార్కాపురం, తర్లుపాడు, సెప్టెంబరు 26 : వైసీపీ పాలనలో దోపిడీలు, అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. పట్టణంలోని జవహర్‌నగర్‌లో కందుల ఇంటి వద్ద తర్లుపాడు మండల కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకను అందజేస్తే ప్రస్తుతం టన్ను ఇసుక రూ.1500 నుంచి రూ.2 వేలకు అమ్ముతూ వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతోంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మద్యం దుకాణాలను ప్ర భుత్వమే నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తూ పేదల డబ్బును లాగేసుకుంటోందన్నారు. వైసీపీ అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షునిగా ఉడుముల చిన్నపురెడ్డి, ఉపాధ్యక్షుడిగా నంబుల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా కందుల చిట్టిబాబు, మండల యువత అధ్యక్షుడిగా మేకల వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడిగా షేక్‌ ఖైరున్‌, రైతు కమిటీ అధ్యక్షుడిగా కూచిపూడి సోమయ్య, బీసీ సెల్‌ అధ్యక్షునిగా గుర్రపుసాల నరసింహులు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా మండ్లపాటి వెలుగొండయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మార్కాపురం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జున్‌, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కంచెర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ ఏసుదాసు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, వీరయ్యయాదవ్‌, గోపీనాథ్‌, మండల మాజీ అధ్యక్షుడు ఏసుపోగు జాను, కె.నరసింహారావు, గోసు వెంకటేశ్వర్లు, వీర్ల వెంకటయ్య పాల్గొన్నారు.