పాస్టర్ అజయ్‌ కుమార్‌కు బ్రదర్ అనిల్‌తో సంబంధాలు?

ABN , First Publish Date - 2021-01-18T00:04:34+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పాస్టర్ అజయ్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలో బలవంతపు మతమార్పిడిలను చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే..

పాస్టర్ అజయ్‌ కుమార్‌కు బ్రదర్ అనిల్‌తో సంబంధాలు?

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పాస్టర్ అజయ్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలో బలవంతపు మతమార్పిడిలను చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీంతో అజయ్ కుమార్ పాస్టర్ అనే విషయాన్ని కూడా మరిచిపోయి.. రాజకీయ నాయకుడిలా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘రోజు రోజూ కాదు గంట గంటకు మతమార్పిడిలు చేస్తామంటూ’ సవాల్ విసిరాడు. ‘‘మీరున్న ప్రాంతాల్లో నాయకులను కాలర్ పట్టుకుని ప్రశ్నించాలంటూ’’ క్రైస్తవులను రెచ్చగొట్టేలా అజయ్ కుమార్ మాట్లాడారు. 


బ్రదర్ అనిల్ కుమార్‌కు అజయ్ కుమార్ క్లోజ్ అసోసియేట్

అయితే బ్రదర్ అనిల్ కుమార్‌కు అజయ్ కుమార్ క్లోజ్ అసోసియేట్ అని తెలుస్తోంది. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితోనూ సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పాస్టర్ అజయ్ కుమార్ ప్రచారం వెనక వైసీపీ ప్లాన్ ఉందని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను కొంతమంది పాస్టర్లు వక్రీకరిస్తూ.. తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. క్రిస్టియన్లను టీడీపీకి దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-01-18T00:04:34+05:30 IST