Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ కౌరవ మూకకు ప్రజానీకం బుద్ది చెబుతారు: పట్టాభి

కృష్ణా: వైసీపీ కౌరవ మూకకు ప్రజానీకం బుద్ది చెబుతారని టీడీపీ నేత పట్టాభి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అదినేత చంద్రబాబు కంట కన్నీరుతో.. ప్రపంచంలోని తెలుగువారంతా ఆవేదన చెందారని తెలిపారు. వార్డు మెంబర్లుగా ఓడిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు. అవమానించిన అసెంబ్లీలోనే చంద్రబాబును రారాజుగా నిలిపేలా.. టీడీపీ కార్యకర్తలు పసుపు ప్రతిజ్ఞ చేయాలని పట్టాభి కోరారు.


అసెంబ్లీలో చంద్రబాబు కుటుంసభ్యులపై అనుచిత వ్యాఖ్యలపై తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ ఆయన శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును ‘లుచ్ఛా’ అంటూ నోటికి పని చెబుతుండగా.. మరోవైపు మరో మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement