వైసీపీ ఏడాది పాలన విధ్వంసం : టీడీపీ

ABN , First Publish Date - 2020-05-27T10:07:16+05:30 IST

వైసీపీ ఏ డాది పాలన రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడిం దని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిం చారు.

వైసీపీ ఏడాది పాలన విధ్వంసం : టీడీపీ

ఒంగోలు (కార్పొరేషన్‌) మే 26 : వైసీపీ ఏ డాది పాలన రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడిం దని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిం చారు. మంగళవారం ఒంగోలులోని టీడీపీ జి ల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వ రరావు, ఎద్దు శశికాంత్‌భూషణ్‌ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చడం తో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వం ఏడాదిలో అన్న క్యాంటిన్లు తొలగించి, పేదల ప్రజలకు ఆ కలి కష్టాలు మిగిల్చిందన్నారు. ఇసుక నూతన విధానం అమల్లోకి తెచ్చి భవన నిర్మాణ రం గాన్ని కుదేలు చేసి, కార్మికులకు ఆకలి కష్టాలు మిగిల్చిందని విమర్శించారు. మద్యపాన నిషే ధం అమలు చేస్తానని ప్రకటించిన సీఎం జగ న్‌ కరోనా విపత్తు కాలంలోనూ మద్యపాన దు కాణాలు తెరిచారని చెప్పారు. రాజధాని అమ రావతిని మార్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. 45 ఏళ్లకే పె న్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చారన్నారు.


విశాఖ ఎల్జీ పా లీమర్‌ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు చేశా రని విమర్శించారు. విశాఖలో మృతులకు రూ. కోటి నష్టపరిహారం అందించిన సీఎం, జిల్లాలో మాచవరం, తిమ్మసముద్రం, ఈతముక్కల గ్రా మాలకు చెందిన దళితులు మరణిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12,500 చెల్లి స్తామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6వేలుతో కలిపి ఇస్తానని అబద్దాలు చెబు తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చే శారు. వైసీపీ ఏడాది పాలన ప్రజలకు కష్టాలు మిగిల్చిందే తప్ప ప్రజా ప్రయోజనం ఏమీ చే యలేదని వారు విమర్శించారు. 

Updated Date - 2020-05-27T10:07:16+05:30 IST