రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన

ABN , First Publish Date - 2021-07-29T05:40:11+05:30 IST

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సూర్యనారాయణరా జు ఆరోపించారు. గోవు భారతీయ జీవన విధా నంలో అంతర్భాగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని కోరారు.

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన
గోవుకు నమస్కరిస్తున్న సూర్యనారాయణరాజు, శ్రీనివాసులు, నాయకులు

బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యనారాయణరాజు 

గోహింసకు వ్యతిరేకంగా నిరసనలు 

సీఎం, వైసీపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మల దహనం


ఒంగోలు (కల్చరల్‌), జూలై 28: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సూర్యనారాయణరా జు ఆరోపించారు. గోవు భారతీయ జీవన విధా నంలో అంతర్భాగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపుతో బు ధవారం జిల్లావ్యాప్తంగా గోహింసకు వ్యతిరేకం గా నిరసన కార్యక్రమాలు జరిగాయి.  స్థానిక క లెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో సూర్యనారా యణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జ గన్‌ పాలన హిందూ వ్యతిరేక అజెండాతో సాగు తోందని విమర్శించారు. హిందువుల మనోభావా లు దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎ మ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డి మాండ్‌ చేశారు. ఎమ్మిగనూరులో బీజేపీ కార్య కర్తలపై దాడి చేసిన చేసిన వారిని వెంటనే అ రెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాల పై దాడులు జరిగినప్పటికీ ఇంతవరకు దోషుల పై ఎటువంటి చర్యలు లేవన్నారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఎం జగన్‌, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగేశ్వర రావు, ఉపాధ్యక్షులు పద్మావతి, నాగేంద్రయాదవ్‌, యోగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అ లాగే జిల్లాలోని మార్కాపురం, దోర్నాల, కంభం, కందుకూరు తదితర ప్రాంతాలలోను నిరసన కా ర్యక్రమాలను చేపట్టి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ది ష్టిబొమ్మలను దహనం చేశారు. 

 

Updated Date - 2021-07-29T05:40:11+05:30 IST