Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం: సుజనా చౌదరి

అమరావతి: వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని ప్రజలు లెంపలేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. వైసీపీ అప్రజాస్వామికంగానే స్థానిక సంస్థలను గెలిచిందని ఆరోపించారు. మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైందని చెప్పారు. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని కొందరు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అదంతా అబద్ధమని కొట్టిపారేశారు. వైసీపీ తమకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అని సుజనాచౌదరి పేర్కొన్నారు.

Advertisement
Advertisement