పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-07-27T22:07:52+05:30 IST
సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీలో ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమన్నూతల
కడప: సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీలో ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో పాతకక్షలు కలకలం రేపుతున్నాయి. కోమన్నూతల గ్రామం సర్పంచ్ చిన్నమునెప్పను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. హతుడు వ్యక్తిగత పనిమీద పులివెందులకు వెళ్లి తిరిగి వస్తుండగా.. దారికాచి వేటకొడవళ్లతో ప్రత్యర్ధులు నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.