Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేశారు: అచ్చెన్నాయుడు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలు తగవని అచ్చెన్నాయుడు అన్నారు. దాడికి నిరసనగా బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారని, పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ అక్రమ అరెస్టులకు పాల్పడిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దాడులతో ప్రజలను, ప్రశ్నించేవారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సమంజసం? అని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అంటేనే బూతు పార్టీ అనే భావన ప్రజల్లో ఉందని, వైసీపీ ఇకనైనా తీరు మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement