నగిరి మున్సిపాలిటీలో వైసీపీ విజయకేతనం

ABN , First Publish Date - 2021-03-14T23:08:35+05:30 IST

నగిరి మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి. మున్సిపాలిటీలో

నగిరి మున్సిపాలిటీలో వైసీపీ విజయకేతనం

తిరుపతి: నగిరి మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి. మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో 7 వార్డులు ఎన్నికలకు ముందే ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 6  వార్డులను వైసీపీ, 1 వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. మిగిలిన 22 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 18 వార్డులలో వైసీపీ విజయం సాధించింది. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 24 వార్డులు వైసీపీ ఖాతలో చేరాయి. 3 వార్డులలో టీడీపీ గెలుపొందింది. టీడీపీ ఖాతాలో మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 

Updated Date - 2021-03-14T23:08:35+05:30 IST