ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు

ABN , First Publish Date - 2020-05-27T10:32:06+05:30 IST

ఎల్లంపల్లి జలాశయంలో నీరు అడుగంటుతుందని, స్థానిక అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర

ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు

స్థానిక అవసరాలు తీరిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌


హాజీపూర్‌, మే 26 : ఎల్లంపల్లి జలాశయంలో నీరు అడుగంటుతుందని, స్థానిక అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, దీని వల్ల నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు.  నీరు లేక చేపలు మృతి చెందుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎల్లంపల్లి జలాశయంలోకి ఎన్ని టీఎంసీల నీటిని నింపారో ప్రజలకు తెలపాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో  జల జాతర పేరిట సంబరాలు చేశారని,  ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకెళ్తున్నారని, ఇక్కడ ఉన్న ప్రజలకు సరిపడా తాగునీరు లభించడం లేద న్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గోపతి మల్లేష్‌, మాధవరపు రమణరావు, తులా మధుసూదన్‌, మల్లికార్జున్‌,  ఎనగంటి నరేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:32:06+05:30 IST