Abn logo
Apr 18 2021 @ 00:00AM

కనకవీడులో పశుగ్రాసం దగ్ధం

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 18: నందవరం మండలం కనకవీడు గ్రామంలో  పశుగ్రాసం దగ్ధమైంది. ఎమ్మిగనూరు ఫైర్‌ ఆఫీసర్‌ మోహన్‌ బాబు తెలిపిన మేరకు.. రైతు వెంకటరాముడు నాలుగు ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వాముదొడ్డిలో నిల్వఉంచాడు. ప్రమాదవశాత్తు నిప్పంకోవడంతో స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది చెరుకుని మంటలను అదుపు చేశారు. రూ. 80వేల విలువచేసే పశుగ్రాసం దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement
Advertisement
Advertisement