Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎప్పుడు కూల‘బడి’పోతుందో..!

విద్యార్థుల్లో నిత్యం గుండె దడ

స్లాబు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు

ప్రమాదకరంగా భవనాలు

ఆందోళనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

పొదిలి (రూరల్‌) నవంబరు 30 : మండలంలో కొన్ని పాఠశాలలు ప్రమాదకరంగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూలిపోతాయా అని అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కూడా లేవు.  మరికొన్ని బడులకు ప్రహరీ, మరుగుదొడ్లు లేక బాలికలు, మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్ని పాఠశాలలకు సరిపడా తరగతి గదులు కూడా లేని పరిస్థితి ఉంది.  ఉన్న గదుల్లోనే దిక్కు తోచని స్థితిలో విద్యా ర్థులు  చదువు కొన సాగిస్తున్నారు. 

అక్కచెరువు గ్రామంలో పాత జనరల్‌ పా ఠశాల పెచ్చులూడి ప్రమా దకరంగా ఉంది.  ఇటీవల కొత్తగా నిర్మిం చిన గదిలోనే అ న్ని తరగతు లనూ నిర్వహిం చాల్సి వస్తోంది. పాత పాఠశాలకు ఇరు వైపులా చిల్ల చెట్లు కమ్ముకొని అడవిని తలపిస్తోంది. అందులోనూ ఊ రికి శివారున ఉండడంతో పాఠ శాలకు పిల్లలను బడికి పంపిం చాలంటే భయమేస్తుందని త ల్లిదండ్రులు అంటున్నారు. అదే విధంగా మాదిరెడ్డిపాలెం ఎంపీ యూపీ స్కూల్‌ స్లాబు నుంచి పె చ్చులూడి కప్పుపై నుంచి వర్షపు నీరు కారుతోంది. దీంతో తరగతి గది మొత్తం బురదగా మారి వి ద్యార్థుల కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పైగాచదువుకుంటున్న సమ యంలో స్లాబు పెచ్చులు ఎవరి మీద పడి ప్రమాదం జరుగుతుం దోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   నాడు- నేడు పథకం వచ్చిన మం డలంలో పాఠశాలలు బాగుపడ లేదని తల్లిదండ్రులు విమర్శి స్తు న్నారు. బాగున్నవాటిని బాగుచేయడం కాకుండా శిథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త భవనాలను నిర్మించడం తోపాటు వసతులు కల్పించాలని తల్లిదం డ్రులు కోరుతున్నారు.  

శిథిలావస్థలో 

పాములపల్లె పాఠశాల

గిద్దలూరు టౌన్‌ : నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల కూలేందు కు సిద్ధంగా ఉంది. పాఠశాలలోని పై కప్పు పెచ్చులూడిపోయింది. రోజూ బడికి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో గడుపుతున్నారు. ఇరువురు ఉపాధ్యాయులు, 35 మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాలలో సరైన వసతులు లేక వర్షం పడితే లోపల అంతా కారుతోంది. అనేక పర్యాయాలు ఉన్నతాధికారులకు పాఠశాల అధ్వాన్నస్థితి గురించి తెలియజేసిన ప్పటికీ ఎలాంటి స్పందన లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యం పాఠశాలకు వస్తూ పోతూ ఉన్నారు. కొద్దిరోజులుగా కు రుస్తున్న వర్షాలకు గోడలు, పైకప్పు పూ ర్తిగా దెబ్బతిని దుర్వాసన వెదజల్లుతున్నది. గ్రామస్తులంతా పాఠశాల అధ్వాన్నంగా ఉండడంతో తమ పిల్లలను పాఠశాలకు పం పందుకు జంకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అధ్వాన్నస్థితి లో ఉన్న పాఠశాల స్థితిని గ మనించి ప్రత్యామ్నాయ చ ర్యలు చేపట్టాలని  గ్రామ స్థులు కోరుతున్నారు. 


కూలేందుకు సిద్ధంగా ఉన్న పాములపల్లె ప్రాథమిక పాఠశాల


Advertisement
Advertisement