పంటకోత ప్రయోగంతో దిగుబడి అంచనా

ABN , First Publish Date - 2021-10-17T05:04:55+05:30 IST

పంట కోత ప్రయోగం ద్వారా పం ట డిగుబడి అంచనావేయవచ్చని వ్యవసాయాధికారి వెంకటక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.

పంటకోత ప్రయోగంతో దిగుబడి అంచనా

ముద్దనూరు అక్టోబరు16:పంట కోత ప్రయోగం ద్వారా పం ట డిగుబడి అంచనావేయవచ్చని వ్యవసాయాధికారి వెంకటక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి బొందలకుంట గ్రామంలో సాగు చేసిన పత్తి పంటను శనివారం వ్యవసాయాధికారులు  పంటకోత ప్రయోగం చేశారు. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే రైతు సాగు చేసిన పత్తి పంటలో 10 మీటర్ల పొడవు10 మీటర్ల వెడల్పు పంటలో పంటకోత ప్రయోగం లో 2.650 కిలోల పత్తి దిగుబడి వచ్చింది. ఒక ఎకరా పంటకు విస్తీర్ణంలో 110 కిలోల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌ఏ ప్రశాంత్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:04:55+05:30 IST