వై-ఫై స్పీడ్... ఇలా పెంచుకోవచ్చు...

ABN , First Publish Date - 2021-01-26T23:11:25+05:30 IST

వైఫై కనెక్షన్ కోసం మంచి బ్రాడ్‌బ్యాండ్ నే ఎంచుకొన్నప్పటికీ... సమస్యలనెదుర్కొంటూండడం సహజం. ఇప్పుడు వై-ఫై వేగాన్ని పెంచే మార్గాలున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

వై-ఫై స్పీడ్... ఇలా పెంచుకోవచ్చు...

బెంగళూరు : వైఫై కనెక్షన్ కోసం మంచి బ్రాడ్‌బ్యాండ్ నే ఎంచుకొన్నప్పటికీ... సమస్యలనెదుర్కొంటూండడం సహజం. ఇప్పుడు వై-ఫై వేగాన్ని పెంచే మార్గాలున్నాయి. వివరాలిలా ఉన్నాయి.


మొదటగా వై-ఫై కు కనెక్ట్ అయిఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్‌కనెక్ట్ చేయాలి.


కొన్ని సార్లు... వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే, ముందుగా వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చాలి. అది కూడా మీ గది మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇక... వైఫై పక్కన ఎటువంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వస్తువుల వంటివి లేకుండా చూసుకోవాలి.  


ఇక ఇంటి అవసరాలను గుర్తింాలి. చాలా మంది ఇళ్ళలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలున్నా కూడా... తక్కువ స్పీడ్ ఉన్న వై-ఫై కనెక్షన్ తీసుకుంటుంటారు. దీంతో... అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి.


ఒక్కోసారి ఎలక్ట్రానిక్ పరికరాల్లో  సమస్యలున్నా కూడా వేగం తగ్గుతుంది. ఇతర పరికరాల్లో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం ఫాస్ట్.కాం ను ఉపయోగించవచ్చు. ఏదైనా సమస్య ఉన్నట్లైతే ముందుగా ఆ పరికరంలో నెట్‌వర్క్ సెట్టింగ్స్ ను సరిచేసుకోవాలి.


ఇక ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో ఉంటే... ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్  కనెక్ట్ అయ్యే క్రమంలో... రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల... రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా నచ్చిన ఛానెల్ ను స్వయంగా ఎంచుకునే అవకాశమెలాగూ ఉంటుంది. 


కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. ఈ క్రమంలో... ఒకమారు... రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడాల్సి ఉంటుంది. అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేసి కూడా పరిశీలించుకోవచ్చు. 


అయినా కూడా వై-ఫై వేగం పెరగకపోతే  మాత్రం...రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడాల్సి ఉంటుంది. అంటే మరో రూటర్ లేదా వైఫై కనెక్షన్ తీసుకోవడం బెటర్. 

Updated Date - 2021-01-26T23:11:25+05:30 IST