Abn logo
Jun 22 2021 @ 01:10AM

మానసిక సాంత్వనకు ఏకైక సాధనం యోగా

ఆనలైనలో యోగా దినోత్సవాలను వీక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

అనంతపురం టౌన్‌, జూన్‌ 21: భారతీయ సంస్కృతికి నిదర్శనం యోగా అని, మానసిక ఒత్తిడులను జయించే సాధనమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ప్ర పంచ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గుత్తిరోడ్డులో ని బెస్ట్‌ యూనివర్సిటీ ఆవరణలో ఆయుష్‌ శాఖ, వివేకానంద యోగాకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో యోగాకేంద్ర జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అధ్య క్షతన యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలో యోగాభ్యసకులు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సైతం ఆనలైనలోనే వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేసీ సిరి, బెస్ట్‌ యూనివర్సిటీ వీసీ చౌడప్ప, రిజిస్ర్టార్‌ శాజీర్‌ అహ్మద్‌, ఆయుష్‌ శాఖ వైద్యుడు డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, యో గా ఇనస్ట్రక్టర్లు దివాకర్‌, మారుతీప్రసాద్‌, రూపాదేవి, క్రిష్ణవేణి, సుశీల, సు ధారాం, రత్నమయ్య, దాదులూరయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం: యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పెంపొందుతాయని ఎస్కేయూ వైస్‌చాన్సలర్‌ రామకృష్ణారెడ్డి పే ర్కొన్నారు. జాతీయ సేవాపతకం, ఎస్కేయూ ఆధ్వర్యంలో సోమవారం వర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్స వాలు నిర్వ హించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కేయూ వీసీ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఎనఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ వరదాచార్యులు, ఇం జనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర, డాక్టర్‌ శ్రీనివాసన, డాక్టర్‌ సదాశివారెడ్డి, యోగా ఇనస్ట్రక్టర్‌ శివానంద తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం అర్బన: మానసిక సాంత్వన చేకూర్చే ఏకైక సాధనం యోగా అని సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ కోరి పేర్కొన్నారు. వర్సిటీలో సో మవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వీసీ కోరి పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ఇనచార్జ్‌ డీన ఆంజనేయ స్వామి, ప్రొఫెసర్లు విజయకుమార్‌, ప్రణతి, కార్యక్రమ నిర్వాహకులు నరేష్‌, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో...  ప్రపంచ యోగా దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యం లో సోమవారం  పార్టీ స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఆ పార్టీ రా ష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్య క్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాను ఆరోగ్య సంజీవిని గా భావించాలన్నారు. నాయకులు రత్నయ్య, సూర్యప్రకాష్‌రెడ్డి, చంద్రశే ఖర్‌, మంజునాథ్‌, నాగేంద్ర, విష్ణు, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో సోమ వారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పోస్ట్‌మాస్టర్‌ రాగిణిదేవి అ ధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్‌ ఆదినారాయణ హాజరై.. ముందుగా కార్యాలయంలో ఉత్తరాలు, బట్వాడా ఉత్తరాలపై యో గా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్టాంపులు వేసి అవ గాహన కల్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణంలో ఉద్యోగులతో కలి సి ఆయన మొక్కలను నాటారు. ఏఎస్పీలు పార్వతి, అనూరాధ, దుర్గా ప్రసాద్‌, ఏపీఎం మెయిల్స్‌ పీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఏపీఎం ఎస్‌బీ గణేనాయక్‌, ఉద్యోగులు ధనుంజయ, అబ్దుల్‌ ఘని, రమేష్‌, శిల్ప, రమాదేవి, నాగభూ షణం స్వామి, కృష్టప్ప, రమణమూర్తి, రాఘవేంద్ర గౌడ్‌, పాస్‌పోర్టు ఆఫీస్‌ రవి, బాషా తదితరులు పాల్గొన్నారు.

నార్పల: యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని నార్పల బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం గ్రామానికి చెందిన ని చ్చనమెట్ల సురేష్‌ ఆధ్వర్యంలో దుబాయ్‌ టేకు మొక్కలు నాటారు. కార్యక్ర మంలో జాఫర్‌, హాకీ కోచ వెంకట రామిరెడ్డి, హ్యాండ్‌బాల్‌ కోచ మద్దిలేటి, వాకర్స్‌ సాయి, డిష్‌ శీనా, లక్ష్మీనారాయణ, పున్నపు లక్ష్మీనారాయణ, వి ద్యార్థులు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.