జేబులు నింపుకోవడానికే ఎల్‌ఆర్ఎస్: గజ్జల యోగానంద్

ABN , First Publish Date - 2020-09-30T00:49:40+05:30 IST

హైదరాబాద్: ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని తెచ్చి పెనాల్టీ రూపంలో భారీగా రుసుములు, ఫీజులు నిర్ధారించడాన్ని బీజేపీ నాయకుడు, శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జల యోగానంద్ తప్పుబట్టారు.

జేబులు నింపుకోవడానికే ఎల్‌ఆర్ఎస్: గజ్జల యోగానంద్

హైదరాబాద్: ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని తెచ్చి పెనాల్టీ రూపంలో భారీగా రుసుములు, ఫీజులు నిర్ధారించడాన్ని బీజేపీ నాయకుడు, శేరిలింగంపల్లి ఇంఛార్జి గజ్జల యోగానంద్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల కాలంలో ఎప్పుడెప్పుడో కొని, పలుమార్లు రిజిస్ట్రేషన్ జరిగిన ప్లాట్లు, ఎన్నో చేతులు మారిన సందర్భంలో వాటిని అక్రమ లేఅవుట్ల పరిధిలోకి చేర్చడం ఎంతమాత్రం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా అనాలోచితంగా 131 జీవో తెచ్చిందని విమర్శలు గుప్పించారు. తక్షణం ఈ పథకాన్ని రద్దు చేసి LRS లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చెయ్యాలన్నారు. డబుల్ బెడ్రూంల విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయని, పేదలను విస్మరించి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని యోగానంద్ విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ కమిషనర్‌ను కలిసి బీజేపీ నాయకులూ వినతి పత్రాన్ని అందజేశారు. 

Updated Date - 2020-09-30T00:49:40+05:30 IST