కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ యోగేంద్ర యాదవ్

ABN , First Publish Date - 2021-09-29T22:00:47+05:30 IST

ప్రశాంత్ భూషణ్ కానీ, నేను కానీ కేజ్రీవాల్ కౄరమైన మనస్థత్వాన్ని గుర్తించలేకపోయాము. కొన్ని స్పష్టమైన లక్ష్యాల కోసం ప్రారంభమైన లోక్‌పాల్ ఉద్యమ లక్ష్యాలను తాకట్టు పెట్టి కేజ్రీవాల్ తన రాజకీయ ప్రయోజనాలను చూసుకున్నారు. ఆయన పక్కా సంఘీవాది..

కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ యోగేంద్ర యాదవ్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై స్వరాజ్ ఇండియా సహ వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్‌పాల్ ఉద్యమంలో అన్నా హజారేతో పాటు పాల్గొన్న ఈయన.. ఆ ఉద్యమ లక్ష్యాలను రాజకీయ అవసరాల కోసం కేజ్రీవాల్ తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఓ ఆంగ్ల మీడియా సంస్థకు రాసిన లేఖలో కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘‘ప్రశాంత్ భూషణ్ కానీ, నేను కానీ కేజ్రీవాల్ కౄరమైన మనస్థత్వాన్ని గుర్తించలేకపోయాము. కొన్ని స్పష్టమైన లక్ష్యాల కోసం ప్రారంభమైన లోక్‌పాల్ ఉద్యమ లక్ష్యాలను తాకట్టు పెట్టి కేజ్రీవాల్ తన రాజకీయ ప్రయోజనాలను చూసుకున్నారు. ఆయన పక్కా సంఘీవాది. నిజానికి ఆయనకు ముస్లింలపై ధ్వేషం ఏం లేదు. కాకపోతే ఓట్ల కోసం ఆ పని చేస్తారు. కానీ ప్రతి ఒక్కరిని తారుమారు చేయగల అతి సామర్థ్యాన్ని అంచనా వేయగలిగాము. ఒక అభద్రతా భావంలో ఉంటాడు. ఇలాంటి తప్పిదాలు ఆయనను తప్పించుకోనివ్వవు’’ అని యోగేంద్ర యాదవ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-09-29T22:00:47+05:30 IST