Diwali సందర్భంగా రామాలయంలో సీఎం యోగి పూజలు

ABN , First Publish Date - 2021-11-04T15:10:21+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ఆలయాలు విద్యుత్ దీపాల కాంతులతో మిలమిలలాడాయి...

Diwali సందర్భంగా రామాలయంలో సీఎం యోగి పూజలు

అయోధ్య : దీపావళి పండుగ సందర్భంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ఆలయాలు విద్యుత్ దీపాల కాంతులతో మిలమిలలాడాయి. అయోధ్య నగరంలోని రామాలయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు.సీఎం యోగి దేవాలయంలో హారతి పట్టారు.అయోధ్యలోని రామజన్మభూమి రాంలాలా వద్ద యోగి ఆదిత్యనాథ్ పూజలు చేశారు.అనంతరం హనుమాన్ గర్హి దేవాలయంలో సీఎంపూజలు చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా జమ్మూకశ్మీరులోని ఉధంపూర్ జిల్లాలో ప్రజలు వందలాది దీపాలు వెలగించారు.


గోవాలోని పనాజీ నగరంలో దీవాలీ సందర్భంగా నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీపావళి సందర్భంగా 9 లక్షల దీపాలతో అయోధ్య ప్రకాశించింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు బారులు తీరి పూజలు చేశారు. 


Updated Date - 2021-11-04T15:10:21+05:30 IST