అయోధ్యలో ఏర్పాట్లను సమీక్షించిన యోగి

ABN , First Publish Date - 2020-08-03T21:16:50+05:30 IST

రామాలయ నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ నిర్వహించనుండటంతో ఆ ఏర్పాట్లను..

అయోధ్యలో ఏర్పాట్లను సమీక్షించిన యోగి

అయోధ్య: రామాలయ నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ నిర్వహించనుండటంతో ఆ ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు స్వయంగా సమీక్షించారు. కార్యక్రమం జరిగే ప్రాంతమంతా కలియదిరుగుతూ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.


మరోవైపు, భూమిపూజకు ముందు హనుమాన్ గధి ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్న నేపథ్యంలో ఆలయ పరిశుభ్రతా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. శంకర్ భారతి అయోధ్య ఫెస్టివల్ సంసిద్ధం చేసిన 5,100 పవిత్ర కలశాలను ప్రధాని ప్రయాణించే దారి పొడవునా ఉంచనున్నారు. అయోధ్యలోని రానోపలిలో ఉన్న సరస్వతి శిశు ఆలయం క్యాంపస్‌లో ఈ కలశాలను ప్రస్తుతం అలంకరించి, సిద్ధం చేస్తున్నారు. భూమిపూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అయోధ్య మొత్తాన్ని అధికార యంత్రాంగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.

Updated Date - 2020-08-03T21:16:50+05:30 IST