Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 13 2021 @ 16:11PM

కులతత్వానికి యోగి ముగింపు పలికారు: అమిత్ షా

లఖ్‌‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో కులతత్వం, వారసత్వం, బుజ్జగింపులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగింపు పలికారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం అజాంగఢ్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. యోగి ఏలుబడిలో యూపీ ఎంతగానో అభివృద్ధి సాధించిందని, 2015కు ముందు ఆర్థిక సూచీలో దేశంలో 6వ స్థానంలో ఉన్న యూపీ, నేడు రెండవ స్థానానికి చేరిందని చెప్పుకొచ్చారు. అలాగే నిరుద్యోగాన్ని కట్టడీ చేశారని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, సీట్లు కూడా చాలా వరకు పెంచారని అమిత్ షా అన్నారు.


ఇక ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్‌పై అమిత్ షా విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అజాంగఢ్ రౌడీ రాజ్యంగా ఉండేదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా కేంద్రంగా అవతరించిందని అన్నారు. బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న తేడాను జామ్ అనే పదం ద్వారా అమిత్ షా వివరించే ప్రయత్నం చేశారు. తమ ఉద్దేశంలో జామ్ అంటే ‘జే-జన్‌ధన్ అకౌంట్, ఏ-ఆధార్ కార్డ్, ఎమ్-మొబైల్ ఫోన్’ అని అదే అఖిలేష్ అర్థంలో జామ్ అంటే ‘జే-జిన్నా, ఏ-అజాం ఖాన్, ఎమ్-ముఖ్తార్’ అని అమిత్ షా విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement