నాలుగున్నరేళ్లలో 6.65 లక్షల ఉద్యోగాలు కల్పించిన యోగి సర్కార్!

ABN , First Publish Date - 2021-07-24T13:42:57+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ప్రాథమిక విద్యాశాఖలో...

నాలుగున్నరేళ్లలో 6.65 లక్షల ఉద్యోగాలు కల్పించిన యోగి సర్కార్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ప్రాథమిక విద్యాశాఖలో 6,696 మంది ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందజేయడంతోపాటు గడచిన నాలుగున్నరేళ్లలో 6.65 లక్షలకు మించిన ఉద్యోగాలను భర్తీ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా 7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు యోగి సర్కారు తెలిపింది. 


ఇందుకోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల వివరాలసు ప్రభుత్వం సేకరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా విపక్షాలు నిరుద్యోగ సమస్యను  ఆయుధంగా చేసుకోకుండా ఉండేందుకు అధికార ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడచిన నాలుగున్నరేళ్లలో భర్తీ అయిన ఉద్యోగాలలో 40 శాతం అవుట్ సోర్సింగ్‌లో తీసుకున్నవేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా వీటిని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-07-24T13:42:57+05:30 IST