యోగి తప్పనిసరిగా గెలవాలి: రైతు నేత రాకేశ్ తికాయత్

ABN , First Publish Date - 2022-01-27T23:34:12+05:30 IST

కొద్ది రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తికాయత్ ప్రకటించారు. కాగా, ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన తాజాగా పేర్కొనడం గమనార్హం. ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన సుదీర్ఘ రైతుల నిరవధిక ఆందోళనలో..

యోగి తప్పనిసరిగా గెలవాలి: రైతు నేత రాకేశ్ తికాయత్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తప్పనిసరిగా గెలవాలని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్ అన్నారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చట్ట సభలో తగినంత ప్రతిపక్ష బలం ఉండాలని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సైతం బలమైన ప్రతిపక్షం కావాలనే ఉద్దేశంతోనే యోగి గెలుపును కాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం యోగి ఆదిత్యనాథ్ గెలవాలనే అనుకుంటున్నాం. మన రాష్ట్రానికి చాలా బలమైన ప్రతిపక్షం కావాలి’’ అని అన్నారు.


కొద్ది రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తికాయత్ ప్రకటించారు. కాగా, ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన తాజాగా పేర్కొనడం గమనార్హం. ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన సుదీర్ఘ రైతుల నిరవధిక ఆందోళనలో తికాయత్ ప్రముఖంగా వ్యహరించారు. అంతే కాకుండా చట్టాలను వెనక్కి తీసుకోకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అయితే చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు నవంబర్‌లో మోదీ ప్రకటించారు. అయినప్పటికీ ఎంఎస్‌పీపై చట్టబద్ధత సహా మరిన్ని రైతుల డిమాండ్లు మిగిలే ఉన్నాయని తికాయత్ చెప్పారు.

Updated Date - 2022-01-27T23:34:12+05:30 IST