ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు సీఎం యోగి కౌంటర్

ABN , First Publish Date - 2020-08-05T23:33:51+05:30 IST

‘రాముడు అందరివాడు’ అంటూ పేర్కొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ముఖ్యమంత్రి యోగి

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు సీఎం యోగి కౌంటర్

లక్నో : ‘రాముడు అందరివాడు’ అంటూ పేర్కొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.


‘‘ఈ రోజు రామ జపాన్ని తీవ్రంగా జపిస్తున్న వారికి అయోధ్య నుంచి రామ్ లల్లా విగ్రహాలను తొలగించారు. దీనికి వారే బాధ్యత వహించాలి. అసలైన ప్రాంతం నుంచి 200 మీటర్లకు దూరంగా వారు శిలాన్యాస్ చేశారు. రాముడు అందరి వాడు అన్నది మేము చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నాము. ఇక్కడి రామ్‌లల్లా విగ్రహాలను తొలగించాలని ప్రయత్నించినపుడు ఈ జ్ఞానం వారికి వచ్చి ఉండాలి. 1949,1984 లో వాళ్లు వాడిన భాషకూ, ఇప్పటి భాషకూ చాలా అంతరం ఉంది’’ అని యోగి దుయ్యబట్టారు.


భూమిపూజ కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరినీ ఆహ్వానించాలని తాము భావించామని, అయితే కరోనా నియమావళి కారణంగా అది సాధ్యం కాలేదని, నియమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన అగ్రనేతలు గానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ ఇందులో భాగస్వామ్యం కాలేదని, యూపీ బీజేపీ అధ్యక్షుడు కూడా రాలేదని యోగి తెలిపారు. 

Updated Date - 2020-08-05T23:33:51+05:30 IST