Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెరుగు శాండ్‌విచ్‌

కావలసినవి :

బ్రెడ్‌ ముక్కలు - నాలుగు, పెరుగు - పావు కప్పు, క్యాప్సికం - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, ఎండు మిర్చి - ఒకటి.


తయారీ :

పెరుగును ఫ్రిజ్‌లో అరగంట పాటు పెట్టాలి. పెరుగులో నీళ్లు లేకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికం, ఉల్లిపాయ, క్యాబేజీ, కొత్తిమీరను కట్‌ చేసుకోవాలి. ఎండుమిర్చిని పొడిపొడిగా చేయాలి. వాటిని పెరుగులో వేసి కలపాలి. బ్రెడ్‌ ముక్కలు తీసుకుని వెన్న రాయాలి. తరువాత బ్రెడ్‌పై పెరుగు మిశ్రమం వేసి, పైన మరొక బ్రెడ్‌ పెట్టాలి. రుచికరమైన ఈ పెరుగు శాండ్‌విచ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.

సోబా నూడుల్స్‌మసాలా అరటికాయ చిప్స్‌పనీర్‌ అనరద్న కబాబ్‌సగ్గుబియ్యం పొంగనాలుసగ్గుబియ్యం కిచిడీబోటీ కబాబ్‌ టమోటా బజియాతందూరి మష్రూమ్స్‌కాలీఫ్లవర్‌ 65 సీక్‌ కబాబ్‌
Advertisement