నేరేడు తినాల్సిందే!

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

నేరేడు పండ్లను చూస్తే నోరూరుతుంది. వాటిని తింటే జిహ్వచాపల్యం తీరడంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...

నేరేడు తినాల్సిందే!

నేరేడు పండ్లను చూస్తే నోరూరుతుంది. వాటిని తింటే జిహ్వచాపల్యం తీరడంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...


  • వీటిలో విటమిన్‌-సి, ఐరన్‌ ఉంటుంది. వీటిని తినడం వల్ల హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
  • నేరేడు పండ్లను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు పెరుగుతుంది. వీటిలో ఉన్న పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 మి.గ్రా పొటాషియం లభిస్తుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని నిరోధిస్తుంది.
  • దంతాలు, చిగుళ్లు గట్టిపడతాయి. ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చిగుళ్ల రక్తస్రావాన్ని అరికడతాయి. జింజివైటిస్‌కు చికిత్సగా పనికొస్తుంది. 
  • సాధారణ ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చూడటంలో నేరేడు పండ్లు బాగా ఉపయోగపడతాయి. 
  • డయాబెటిస్‌ లక్షణాలను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ రక్తంలో షుగర్‌ స్థాయిలను సాధారణంగా ఉంచుతుంది. నేరేడు ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. 
  • కొన్ని నేరేడు పండ్లు తీసుకుని అందులో పావు టేబుల్‌స్పూన్‌ బ్లాక్‌సాల్ట్‌, తేనే, కొద్దిగా అల్లంముక్క, చిటికెడు చాట్‌మసాలా వేసి మిక్సీలో బ్లెండ్‌ చేసుకోవాలి. నేరేడు పండ్లు విత్తనాలు తీసి వేసుకోవాలి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. 

Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST