కొవిడ్‌ డ్యూటీలకు వెళ్లాల్సిందే..

ABN , First Publish Date - 2021-05-11T05:42:39+05:30 IST

సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కొవిడ్‌ ఆసుపత్రిలో షిఫ్టులవారీగా పనిచేయాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

కొవిడ్‌ డ్యూటీలకు వెళ్లాల్సిందే..
సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నిషాంతి

-వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం 

- సచివాలయ ఉద్యోగులకు సబ్‌కలెక్టర్‌ హెచ్చరిక 

హిందూపురం టౌన, మే 10: సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కొవిడ్‌ ఆసుపత్రిలో షిఫ్టులవారీగా పనిచేయాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో వైద్యులు, స చివాలయ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అనంతపురం, కదిరి, హిందూపురంలో కొవిడ్‌ ఆసుపత్రిలో సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు. 20బెడ్‌లకు ఒక్కరు చొప్పున షిఫ్ట్‌లవారీగా విధులు నిర్వహించాలన్నారు. అలా ఎవరైనా చేయకపోతే విపత్తు నిర్వహణల చట్టం కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రెంట్‌లైన వారియర్స్‌గా పనిచేస్తున్న సందర్భంలో మీరు ఆసుపత్రిలో డ్యూటీ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా ఆసుపత్రి డ్యూటీకి వెళ్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ, బలరాం, టూటౌన సీఐ మన్సూరుద్దీన, వైద్యులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-05-11T05:42:39+05:30 IST