మీకు తెలుసా!
ABN , First Publish Date - 2021-06-17T07:54:27+05:30 IST
మనిషి మెడలో ఉన్నట్టుగానే జిరాఫీ మెడలో ఏడు ఎముకలు ఉంటాయి. కానీ పొడవుగా ఉంటాయి.
- మనిషి మెడలో ఉన్నట్టుగానే జిరాఫీ మెడలో ఏడు ఎముకలు ఉంటాయి. కానీ పొడవుగా ఉంటాయి.
- వానపాముల్లో ఆడ, మగ ఉండవు. అన్ని వానపాముల్లో ఆడ, మగ భాగాలుంటాయి.
- ఊసరవెల్లి నాలుక దాని శరీరంకన్నా పొడవుగా ఉంటుంది. తన నాలుకతో సెకను వ్యవధిలోనే కీటకాన్ని అందుకోగలదు.
- హమ్మింగ్ బర్డ్ సెకనుకు 200 సార్లు తన రెక్కలను ఆడించగలదు.
- ఎంపరర్ పెంగ్విన్లు నీటి లోపల 27 నిమిషాల వరకు ఉండగలవు. 500 మీటర్ల లోతు వరకు వెళ్లగలవు.
- రెండు మూపురాలు ఉండే ఒంటె నీళ్లు లభించినప్పుడు 50 లీటర్ల వరకు నీళ్లు తాగుతుంది.