Abn logo
Nov 22 2020 @ 08:33AM

ప‌వ‌న్ 27లో ఆ యంగ్ హీరోయిన్ న‌టిస్తుందా..?

Kaakateeya

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వ‌కీల్‌సాబ్’ అంటూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ  సినిమా త‌ర్వాత ప‌వ‌న్ పూర్తి చేయాల్సిన సినిమాల లిస్టు పెద్ద‌దిగానే ఉంది. ఈ లిస్టులో డైరెక్ట‌ర్ క్రిష్ సినిమా కూడా ఉంది. కోవిడ్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ సినిమాను కూడా ప‌వ‌న్ పూర్తి చేసేసి ఉండేవాడు. కానీ ఏం చేద్దాం. క‌రోనా ప్ర‌భావంతో సినిమా ఆల‌స్య‌మైంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా ఇప్పుడు ఆమె స్థానంలో నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే నిధి అగ‌ర్వాల్ మంచి అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ట్లే. 

Advertisement
Advertisement