Advertisement
Advertisement
Abn logo
Advertisement

Dubai ‌లో భార్య బర్త్‌డే నాడు రూ.3.24కోట్ల గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన Indian భర్త..

దుబాయ్: పుట్టినరోజున మనవాళ్లకు మనం గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. అందులోనూ వారికి చాలా ఇష్టమైన వాటిని గిఫ్ట్‌గా ఇస్తే.. ఇక అవతలి వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ సమయంలో వారి ఆనందాన్ని చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. ఇదిగో ఇలాగే యూఏఈలో ఓ భారత యువ పారిశ్రామికవేత్త తన భార్య బర్త్‌డే నాడు ఆమెకు ఎంతో ఇష్టమైన బహుమతి ఇచ్చి, సర్‌ప్రైజ్ చేశాడు. అదేదో సాదాసీదా బహుమతి కాదండోయ్. ఏకంగా 1.6 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.3.24కోట్లు) విలువ చేసే రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారు. తనకు ఎంతో ఇష్టమైన కారు తన పుట్టినరోజున బహుమతిగా లభించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పైగా నెల రోజుల కిందే ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే తన జీవితంలోనే అద్భుతమైన గిఫ్టులు అందుకున్నట్లైందామెకు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అమ్జద్ సితార(30) యూఏఈలో బీబీసీ అనే కంపెనీ నడిపిస్తున్నాడు. గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా కార్మికులను సరఫరా చేస్తోందీ సంస్థ. మ్యాన్‌పవర్ సప్లైలో ప్రస్తుతం యూఏఈలోనే టాప్ కంపెనీ. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అమ్జద్ సితార. ఆయనకు భార్య మార్జన అమ్జాద్(24), కూతురు ఐరా మాలిక ఉన్నారు. అక్టోబర్ 2న మార్జన పుట్టిన రోజు కావడంతో ఆమెకు ఎదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే ఆమెకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. సరిగ్గా బర్త్‌నాడు ఆమెను దుబాయ్‌లో కారు కొన్న షోరూంకు తీసుకెళ్లాడు. 


అప్పటికే అమ్జద్ సూచన మేరకు షోరూం వాళ్లు ఆ కారును పెద్ద థర్మకోల్ బాక్సులో గిఫ్ట్‌లా ప్యాక్ చేసి పెట్టారు. అలాగే ఆ భారీ బాక్సును నల్ల రిబ్బన్‌తో కట్టిపెట్టారు. ఆ బాక్సుపై "హ్యాపీ బర్త్‌డే మై లవ్. నా ప్రతిక్షణాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్స్. ప్రేమతో అమ్జద్ సితార" అని రాసి ఉంది. బాక్సుకు ఉన్న రిబ్బన్‌ను దంపతులిద్దరూ ఒకేసారి విప్పడంతో లోపల బెలూన్స్, కారు కనిపించాయి. అంతే.. తనకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ వ్రైత్ కారు చూసిన మార్జన ఆనందానికి అవధుల్లేవు. అనంతరం మార్జన, అమ్జద్ వారి చిన్నారి ఐరాతో కలిసి కారు ముందు ఫొటోలు దిగారు. కొద్దిసేపు కారులో కూడా కూర్చున్నారు. దీన్నంతటినీ వీడియో తీయించిన అమ్జద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దాంతో అది కాస్తా వైరల్ అయింది.       


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement