యువతి అదృశ్యం.. అతనిపై అనుమానాలు
ABN , First Publish Date - 2021-02-28T15:07:17+05:30 IST
పనికి వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ..
హైదరాబాద్/రాజేంద్రనగర్ : పనికి వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బండ్లగూడ బస్టాప్ ప్రాంతంలో నివసిస్తున్న హనుమంతు పెద్ద కుమార్తె ఎ.మౌనిక(19) స్థానికంగా ఓ సూపర్మార్కెట్లో పనిచేస్తోంది. ఫిబ్రవరి 15న భోజనం చేయడానికి ఇంటికి వచ్చింది. తిరిగి సూపర్‌మార్కెట్‌కు వెళ్లలేదు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. అయితే వారికి శివ అనే యువకుడిపై అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.