కాటేసిన పాముతో ఆస్పత్రికి యువకుడు... భయపడిన డాక్టర్లు

ABN , First Publish Date - 2021-06-14T00:05:03+05:30 IST

కాటేసిన పాముతో ఆస్పత్రికి యువకుడు... భయపడిన డాక్టర్లు

కాటేసిన పాముతో ఆస్పత్రికి యువకుడు... భయపడిన డాక్టర్లు

బళ్లారి/కర్ణాటక: ఓ యువకుడు సజీవంగా ఉన్న పామును పట్టుకుని ఏకంగా ఆసుపత్రికి వెళ్లిన ఘటన బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. కంప్లి తాలూకా, ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప‌ అనే యువకుడు పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పని చేస్తున్న జాడప్పను నాగుపాము కాటు వేసింది. అయితే కాడప్ప భయపడకుండా కాటు వేసిన పామును సజీవంగా పట్టుకుని మెట్రి గామంలోని‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ లేకపోవడంతో స్నేహితుడి సహాయంతో వెంటనే కంప్లి‌ ప్రభుత్వ అసుపత్రికి వెళ్లారు. అక్కడ యువకుడి చేతిలో పామును చూసిన డాక్టర్లు భయపడిపోయి బయటకు వెళ్లమన్నారు.. అనంతరం విషయం తెలుసుకుని కాడప్పకు ప్రథమ చికిత్స చేసి బాళ్లారి విమ్స్‌కు తరలించారు. 




Updated Date - 2021-06-14T00:05:03+05:30 IST