ఐదేళ్ల క్రితం చనిపోయిన తాత ప్రూఫ్స్‌తో సిమ్‌ తీసుకుని.. 22 ఏళ్ల కుర్రాడి నీచమిది.. 82 మంది మహిళలకు..

ABN , First Publish Date - 2021-08-03T02:16:32+05:30 IST

ఐదేళ్ల క్రితం చనిపోయిన తాత పేరు ఉపయోగించి నీచానికి ఒడిగట్టాడో యువకుడు. తాత ప్రూఫ్స్‌తో దొంగ సిమ్ కార్డు తీసుకొని ఛండాలమైన పనులు చేశాడు.

ఐదేళ్ల క్రితం చనిపోయిన తాత ప్రూఫ్స్‌తో సిమ్‌ తీసుకుని.. 22 ఏళ్ల కుర్రాడి నీచమిది.. 82 మంది మహిళలకు..

ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల క్రితం చనిపోయిన తాత పేరు ఉపయోగించి నీచానికి ఒడిగట్టాడో యువకుడు. తాత ప్రూఫ్స్‌తో దొంగ సిమ్ కార్డు తీసుకొని ఛండాలమైన పనులు చేశాడు. ఈ జుగుప్సాకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఘజియాబాద్‌లో కొబ్బరి బోండాలు అమ్ముకునే ఒక 22 ఏళ్ల యువకుడు ఛండాలమైన ప్లాన్ వేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 22 ఏళ్ల సోనూ చౌదరి.. తన కొబ్బరి బోండాల వ్యాపారాన్ని మూసేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఆలోచన చేసి హోం డెలివరీ చేస్తామని చెప్తూ తన మొబైల్ నంబరును షాపు ముందు తగిలించాడు.


ఇలా కొబ్బరి బోండాలు హోం డెలివరీ అనడంతో చాలా మంది అతనికి కాల్స్ చేశారు. అలా తండ్రి కోసం కాల్ చేసిన 26 ఏళ్ల యువతిని సోనూ హెరాస్ చేయడం ప్రారంభించాడు. ఆమె నంబర్ తీసుకొని వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు పంపడం, వీడియో కాల్స్ చేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో విసుగెత్తిన సదరు యువతి ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సైబర్ సెల్‌కు పంపగా.. వాళ్లు ఫోన్ నెంబరును ట్రేస్ చేశారు. అప్పుడు వారికి దిమ్మతిరిగేలా ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి పేరున ఈ నెంబర్ ఉంది.


ఈ విషయంపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టడంతో అసలు నిజం బయటపడింది. సోనూ వాళ్ల తాతయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. ఆయన ప్రూఫ్స్ తీసుకెళ్లి ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసిన సోనూ.. కొబ్బరి బోండాల కోసం తనకు ఫోన్ చేసిన అమ్మాయికి ఆ నెంబరుతో ఫోన్ చేశాడు. ఆమె పేరు కనుక్కొని ఫోన్ కట్ చేసేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు నరకం చూపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ చాట్ హిస్టరీ, వీడియో కాల్స్‌ను స్క్రీన్‌షాట్స్ తీసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతరత్రా మార్గాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు సోనూను పట్టకున్నారు. అతని దగ్గర ఉన్న మొబైల్‌లో మొత్తం 82 మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నట్లు తేలింది. వీరందరినీ అతను ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-08-03T02:16:32+05:30 IST