Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసుల కళ్లుగప్పిన ఆ యువకుడు.. చెట్టెక్కి మెడకు ఉరితాడు బిగించుకుని.. పెద్దగా కేకలు పెట్టసాగాడు.. దీని వెనుక ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని శివపురి పరిధిలోగల భైతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు అరుణ్(మారు పేరు) తనకు మేనకోడలు వరసయ్యే బాలికను ప్రేమించాడు. తరువాత ఆ బాలికను తీసుకుని జైపూర్ వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరూ వివాహం చేసుకుని కలిసి కాపురం చేయసాగారు. అయితే ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆ జంటను జైపూర్‌లో పట్టుకున్నారు. 

అయితే పోలీసుల బారి నుంచి అరుణ్ తప్పించుని పారిపోయాడు. పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే రెండు రోజుల క్రితం అరుణ్ తిరిగి గ్రామానికి వచ్చాడు. తన భార్యను తనకు అప్పగించాలని ఆ బాలిక కుటుంబ సభ్యులను కోరాడు. అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో చెట్టెక్కి ఉరి వేసుకుంటానంటూ.. తాడును మెడకు చుట్టుకుని .. తన భార్యను తనకు అప్పగించాలని కేకలు వేయసాగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడిని కిందకు దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement