Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రమాదవశాత్తు పెన్నానదిలో యువకుడు మృతి

సిద్దవటం, డిసెంబరు 2: సిద్దవటం పెన్నానదిలో ప్రమాదవశాత్తు జారి పడ్డ యువకుడు పెద్దపల్లి రాము (32) మృతి చెందాడు. మృతుని సోదరుడు శ్రీధర్‌ కథనం మేరకు వివరాలిలా... సిద్దవటం మండలం మంగళవీధికి చెందిన పెద్దపల్లె రాము గురువారం పెన్నానది బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డాడడు. గమ నించిన స్థానికులు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయినప్పటకీ ఫలితం లేదని గాండ్లపాలెం సమీపంలో మృతదేహం లభ్యం అయ్యిందన్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు.


  

Advertisement
Advertisement