పీఏబీఆర్‌ కాలువలో యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2021-08-02T06:20:35+05:30 IST

మండలంలోని పీఏబీఆర్‌ డ్యాం సమీప కాలువలో ఓ యు వకుడు ఆదివారం గల్లంతయ్యాడు. అనంతపురానికి చెందిన నాగరాజు అతని స్నేహితులతో కలిసి పీఏబీఆర్‌డ్యాంకు వచ్చారు.

పీఏబీఆర్‌ కాలువలో యువకుడు గల్లంతు

ఉరవకొండ, ఆగస్టు 1 : మండలంలోని పీఏబీఆర్‌ డ్యాం సమీప కాలువలో ఓ యు వకుడు ఆదివారం గల్లంతయ్యాడు. అనంతపురానికి చెందిన నాగరాజు అతని స్నేహితులతో కలిసి పీఏబీఆర్‌డ్యాంకు వచ్చారు. స్నేహితులతో కలిసి కౌకుంట్ల రోడ్డులోని కాలువతో సరదాగా నీటి ప్రవాహం చూస్తుండగా... నాగరాజు ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం చీకటి పడేంత వరకూ బంధువులు గాలించారు.  ఆచూకీ లభ్యం కాలేదు. ఉరవకొండ పోలీసులకు సమాచారాన్ని అందించారు. 

Updated Date - 2021-08-02T06:20:35+05:30 IST