ఇంట్లో 62 ఏళ్ల వృద్ధుడి శవం.. ఫేస్‌బుక్‌‌లో చాటింగ్ హిస్టరీలో చూస్తే బయటపడ్డ స్వలింగ సంపర్క బంధం.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-21T12:09:20+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నవంబర్ 16న ఒక 62 ఏళ్ల వృద్ధుడి శవం దొరికింది. దానిని హత్య కేసుగా అనుమానించిన పోలీసులు నాలుగు రోజులలో హంతుకుడిని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు...

ఇంట్లో 62 ఏళ్ల వృద్ధుడి శవం.. ఫేస్‌బుక్‌‌లో చాటింగ్ హిస్టరీలో చూస్తే బయటపడ్డ స్వలింగ సంపర్క బంధం.. చివరకు ఏం జరిగిందంటే..

గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నవంబర్ 16న ఒక 62 ఏళ్ల వృద్ధుడి శవం దొరికింది. దానిని హత్య కేసుగా అనుమానించిన పోలీసులు నాలుగు రోజులలో హంతుకుడిని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. 


అహ్మదాబాద్‌ నగరంలోని సాబర్‌మతి ప్రాంతంలో గత మంగళవారం జీతేంద్ర సేఠి(62) అనే వ్యక్తిని ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. హత్య జరిగిన సమయంలో జీతేంద్ర ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని తెలిసింది. పోలీసులు ఈ హత్య కేసుని విచారణ చేయగా.. ఇదొక దోపిడీ హత్య కేసు కావచ్చునని అనుమానం వచ్చింది. 


మృతుడి శరీరంపై నుంచి బంగారు గొలుసు, రూ.50 వేలు నగదు మాయం. మృతుడి బైక్ కూడా దొంగిలించిన హంతకుడు. ఈ హత్య కేసులో మృతుడి ఫోన్ కాల్ రికార్డ్స్ సహాయంతో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు. నిందితుడు ఉమంగ్ దర్జీ(23) వద్ద నుంచి జీతేంద్ర బైక్, బంగారు గొలుసు, రూ.39 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమంగ్ దర్జీని విచారణ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ నిజం తెలిసింది.


పోలీసుల కథనం ప్రకారం.. సీనియర్ సిటిజెన్ అయిన జీతేంద్రకు ఫేస్ బుక్ చాటింగ్ చేసే అలవాటు ఉంది. అలా ఫేస్ బుక్ ద్వారా ఉమంగ్ అనే యువకుడు జీతేంద్రకు పరిచయమయ్యాడు. వారిద్దరూ తరుచూ కలుసుకునేవారు. అయితే జీతేంద్ర నుంచి ఉమంగ్ డబ్బులు తీసుకునేవాడు. దానికి బదులుగా ఉమంగ్‌తో జీతేంద్ర శృంగారం చేసేవాడు. ఈ బంధంతో విసిగిపోయిన ఉమంగ్ ఇకముందు అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జీతేంద్ర గత మంగళవారం ఉదయం ఉమంగ్‌కు ఫోన్ చేశాడు. తన ఇంటికి రమ్మని పిలిచాడు.


ఇంటికి వచ్చిన ఉమంగ్‌తో ఆ రోజు కూడా జీతేంద్ర తన కోరికలు తీర్చమన్నాడు. కానీ ఉమంగ్ ఇకపై తాను అలా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీంతో జీతంద్ర అతనిపై బలవంతం చేశాడు.ఇద్దరి మధ్య తోపులాటలో జీతేంద్ర ఒక కత్తితో జీతేంద్ర కడుపులో పొడిచాడు. దీంతో జీతేంద్ర విలవిల్లాడి అక్కడే చనిపోయాడు. ఆ హత్యని దారి మళ్లించడానికి ఉమంగ్ మృతుడి శరీరంపై నుంచి బంగారు గొలుసు ఇంట్లోని రూ.50 వేలు, బైక్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.


దొంగిలించిన రూ.50 వేలలో కొంత తన గర్లఫ్రెండ్‌కు ఇచ్చానని నిందితుడు చెప్పాడు. ప్రస్తుతం ఉమంగ్‌పై పోలీసులు దొంగతనం, హత్య కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-11-21T12:09:20+05:30 IST