Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా నీటిలో కొట్టుకువచ్చిన వరుని మృతదేహం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని లాల్ బర్రాలో గల టెకాడీ సర్రాటీ రిజర్వాయర్‌లో గల్లంతయిన ముగ్గురు స్నేహితులలో ఒకరికి వచ్చేనెలలోనే వివాహం జరగనుంది. అతని కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో అతని మృతదేహం జలాశయం నీటిలో కొట్టుకువచ్చింది. దీనిని చూడగానే అతని కుటుంబ సభ్యులంతా షాక్‌కు లోనై, తరువాత పెద్దపెట్టున రోదించారు. డిసెంబరు 5న అతనికి వివాహం జరగనుందని, ఇంతలోనే ఇటువంటి ఘోరం చూడాల్సివచ్చిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే టెకాడి ప్రాంతానికి చెందిన దీపాంకర్  రిజర్వాయర్ దగ్గర పులి కనిపించినట్లు తెలియగానే, దానిని చూడాలనే ఆసక్తితో తన నలుగురు స్నేహితులతోపాటు ఆ ప్రాంతానికి వెళ్లాడు. 

జలాశయం ఒడ్డున వారు కాసేపు ఆహ్లాదం పొందాక.. పడవ ద్వారా జలాయంలో ప్రయాణించాలనుకున్నారు. ఈ ఆలోచనే వారి ప్రాణాలను బలిగొంది. జలాశంలో గల్లంతయిన నలుగురి మృతదేహాలను గస్తీ సిబ్బంది వెలికితీశారు. చివరిగా దీపాంకర్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతులలో అశ్వనీ బ్రహ్మ హోటల్ వ్యాపారం నిర్వహిస్తుండగా, మహాకాళ్ సేన.. బ్లాక్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈ నలుగురు స్నేహితులు తరుచూ కలుకుంటుంటారు. జలాశయం సమీపంలోని శివాలయానికి వెళుతుంటారు. దీపాంకర్‌కు పెళ్లి కుదిరిందని తెలియగానే వీరంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement