Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి వేదిక మీద వధూవరులు.. ఇంతలో వేదిక ఎక్కి వధువు నుదుట కుంకుమ దిద్ది కౌగిలించుకున్న యువకుడు.. వధువు మాటలకు షాక్!

పెళ్లి వేదిక మీద వధూవరులిద్దరూ కూర్చుని ఉన్నారు.. ఎదురుగా బంధుమిత్రులు ఉన్నారు.. ఇంతలో ఓ యువకుడు వేదిక ఎక్కి వధువు నుదుటన కుంకుమ పెట్టాడు.. అనంతరం ఆమెను కౌగిలించుకున్నాడు.. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పాడు.. ఈ దృశ్యం చూసిన వరుడు, అక్కడున్న అందరూ షాకయ్యారు.. అనంతరం వధువు మాటలకు ఆ యువకుడు కూడా షాకయ్యాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఘోరఖ్‌పూర్ జిల్లాలోని బుహార్ ప్రాంతానికి చెందిన రాణి అనే యువతి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించారు. సంపాదన కోసం ముఖేష్ వేరే ఊరు వెళ్లాడు. ఆ సమయంలో వేరే యువకుడితో రాణికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. బుధవారం సాయంత్రం పెళ్లికి ముహూర్తంగా నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖేష్ బుధవారం గ్రామానికి వచ్చాడు. సరాసరి పెళ్లి వేదిక ఎక్కి అందరూ చూస్తుండగా రాణి నుదుటన కుంకుమ అద్దాడు. 


వరుడి ఎదురుగానే రాణిని ముఖేష్ కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యం చూసి అందరూ షాకయ్యారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని అందరి ముందూ చెప్పాడు. అయితే వధువు ఆ యువకుడి ప్రేమను తిరస్కరించింది. పెద్దలు కుదుర్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యువకుడని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో వివాహం అనుకున్న ప్రకారం జరిగిపోయింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement