విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ లో కత్తితో యువకుడు హల్ చల్

ABN , First Publish Date - 2020-05-30T23:32:05+05:30 IST

విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ లో కత్తితో యువకుడు హల్ చల్

విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ లో కత్తితో యువకుడు హల్ చల్

విశాఖపట్నం: విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ లో కత్తితో మహేశ్వరావు అనే యువకుడు హల్ చల్ చేశాడు. కమిషనర్ ప్రవేశద్వారం దగ్గర యువకుడు వెంట తెచ్చుకున్న కత్తి మెటల్ డిటెక్టర్ కు చిక్కింది. అనంతరం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషనరేట్ కు ఎందుకు వచ్చావంటూ యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కమిషనరేట్ కు యువకుడు కత్తితో ఎందుకు వచ్చాడన్నది పోలీసుల విచారణలో వెల్లడికానుంది.

Updated Date - 2020-05-30T23:32:05+05:30 IST