యువత వృత్తినైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-09T06:53:28+05:30 IST

గిరిజన యువత వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు.

యువత వృత్తినైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
శిక్షణ పొందిన యువతికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న పీవో వెంకటేశ్వర్‌, ఓఎస్‌డీ సతీష్‌ కుమార్‌


ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

చింతపల్లి, మార్చి 8: గిరిజన యువత వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. చింతపల్లి పోలీసులు, ఐటీడీఏ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో తాడేపల్లిలో టైలరింగ్‌, డ్రైవింగ్‌ల్లో శిక్షణ పొందిన వారికి సోమవారం స్థానిక వైటీసీలో ధ్రువపత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. టైలరింగ్‌ శిక్షణ పొందిన మహిళలతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి యూనిఫామ్‌, రెడీమేడ్‌ దుస్తులు కుట్టిస్తూ ఆదాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ శిక్షణ పొందిన యువతీ, యువకులు నిరంతర సాధన చేస్తూ స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌ మాట్లాడుతూ.. పోలీసు శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన యువతీ, యువకులు ఆదాయవనరులను మెరుగుపర్చాకోవాలన్నారు. ఈకార్యక్రమంలో యువ వికాస్‌ సొసైటీ సౌత్‌ హెడ్‌ రాజేశ్వరి, ఏపీ హెడ్‌ చంద్ర, సీఐ శ్రీను, ఎస్‌ఐ అహ్మద్‌ అలీ పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-09T06:53:28+05:30 IST