Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే షాకింగ్ ఘటన.. అబ్బాయి ఇంటి బాత్రూంలో ఇద్దరూ అనుమానాస్పద మృతి.. అసలేం జరిగిందంటే..

ప్రత్యేకావసరాలు గల యువతీయువకులు... ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నారు. వారి కోరికను ఇరువైపు తల్లిదండ్రులూ అంగీకరించి.. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా చేశారు. ఇక పెళ్లే తరువాయి అనుకుంటూ, అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. వివాహానంతరం తమ జీవితం అందంగా ఉండాలని కోరుకున్న ఆ జంట.. అందుకు తగ్గట్టుగా అవసరమైన సామాగ్రి కొనుక్కునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈలోగా అనుకోకుండా ఓ రోజు బాత్రూంలో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఊహించని ఈ ఘటనతో, ఆ రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి...

ప్రతీకాత్మక చిత్రం

సూరత్‌కు చెందిన దివ్యాంగుడైన అర్పిత్ పటేల్ (24) అనే వ్యక్తి, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఓ మాల్‌లో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అలాగే సమీపంలోని కమ్రేజ్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన ధృతి(21) కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ ఇద్దరూ నవ్‌సారిలోని ప్రత్యేక అవసరాల పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ మాటలు రాకపోయినా.. మనసులు, మనోభావాలు కలిశాయి. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. ఇటీవలే వారికి నిశ్చితార్థం కూడా చేశారు. అప్పటి నుంచి అర్పిత్ పటేల్ ఇంటికి.. యువతి తరచూ వస్తూ, పోతూ ఉండేది.

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి రోజు దగ్గర పడుతుండడంతో దుస్తులు తదితర సామాగ్రి కొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ధృతి, అర్పిత్ కలిసి రోజూ అదే పనిలో ఉండేవారు. ఓ రోజు అర్పిత్ తల్లిదండ్రులు బయటి ఊరికి వెళ్లారు. ఆ రోజంతా ధృతి, అర్పిత్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగానీ.. సాయంత్రంలోగా బాత్రూంలో మృతి చెంది ఉన్నారు. ఇంటికి చేరుకున్న అర్పిత్ తల్లిదండ్రులు.. వారిని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాత్రూంలో గీజర్ నుంచి గ్యాస్ లీకైనట్లు గుర్తించారు.

ప్రతీకాత్మక చిత్రం

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక మృతిచెందారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అందులోనూ బాత్రూంలో వెండిలేషన్ కూడా లేదు. అయితే గ్యాస్ లీకవడం వల్లే చనిపోయారా, లేక కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఎవరి ప్రమేయమేదైనా ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వివాహం ఉందనగా.. అన్యోన్యంగా ఉండే ఆ ఇద్దరూ ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement