యంగ్‌ సైంటిస్ట్‌

ABN , First Publish Date - 2020-02-13T05:56:33+05:30 IST

(ఇస్రో) యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువ విగ్యాని కార్యక్రమం(యువిక) పేరిట పాఠశాల విద్యార్థుల కోసం దీన్ని గత ఏడాది నుంచి

యంగ్‌ సైంటిస్ట్‌

  • ప్రోగ్రామ్‌ 2020
  • ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌

(ఇస్రో) యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువ విగ్యాని కార్యక్రమం(యువిక) పేరిట పాఠశాల విద్యార్థుల కోసం దీన్ని గత ఏడాది నుంచి అమలు చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో ప్రోగ్రామ్‌ని నిర్వహించనున్నారు. స్పేస్‌ టెక్నాలజీ, స్పేస్‌ సైన్స్‌, స్పేస్‌ అప్లికేషన్స్‌పై చిన్నారులకు ప్రాథమిక అవగాహన కల్పించేందుకు దీన్ని ఉద్దేశించారు. క్యాచ్‌ దెమ్‌ యంగ్‌ పేరుతో సదరు వయస్కులను ఆకట్టుకోవడమే కాదు, తద్వారా జాతికి  అవసరమైన స్పేస్‌ సైంటిస్టులను అందించేందుకు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా తోడ్పడాలని ఇస్రో భావిస్తోంది. 


వేసవి కాలం సెలవుల్లో రెండు వారాలపాటు కొనసాగుతుంది. ఈ ఏడాది మే 11 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నారు. చర్చలు, సుప్రసిద్ధ సైంటిస్టుల అనుభవాలను పంచుకోవడం, ఫ్యాకల్టీ - ల్యాబ్‌ సందర్శనలు అలాగే నిపుణులతో డిస్కషన్స్‌, ప్రాక్టికల్‌ - ఫీడ్‌ బ్యాక్‌ సెషన్స్‌ ఈ ప్రోగ్రామ్‌లో మిళితమై ఉంటాయి. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ముగ్గురేసి చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. మరో అయిదు మంది ఒసిఐ (విదేశాల్లో నివశిస్తున్న భారత పౌరులు) కింద దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీపడవచ్చు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆధారంగా సెలెక్షన్‌ ఉంటుంది. ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సిలబస్‌ పరిధిలో అయినప్పటికీ ఈ విద్యాసంవత్సరంలో 8,9 చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలోని అకడమిక పర్ఫార్మెన్స్‌, విద్యేతర కార్యకలాపాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 8వ తరగతిలోని అకడమిక పర్ఫార్మెన్స్‌కు 60 శాతం అలాగే ఇతరత్రా కార్యకలాపాలకు వేర్వేరుగా వెయిటేజ్‌ ఇచ్చి ఎంపిక చేస్తారు. వెయిటేజ్‌ ప్రకారం టై ఏర్పడినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు స్పెషల్‌ వెయిటేజ్‌ ఇస్తారు. అలాగే వయస్సులో చిన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. 


ఆసక్తి ఉన్న విద్యార్థులు ఠీఠీఠీ.జీటటౌ.జౌఠి.జీుఽ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 2న ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎవరు ఎంపికయ్యారన్న జాబితాను విడుదల చేస్తుంది. సదరు విద్యార్థుల అటె్‌స్టడ్‌ కాపీలను మార్చి 23లోపు అప్‌లోడ్‌ చేసుకోవాలి. తుది జాబితాను మార్చి 30 న విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు ఇస్రోకు చెందిన నాలుగు కేంద్రాలు - అహ్మదాబాద్‌, షిల్లాంగ్‌, తిరువనంతపురం, బెంగళూరులో రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. ఇస్రో అతిథి గృహాలు, హాస్టల్స్‌లో వీరికి అకామిడేషన్‌ కల్పిస్తారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి సంరక్షకుడు సహా రాను పోను రెండో తరగతి రైలు చార్జీలు చెల్లిస్తారు. వసతి, భోజనం కోర్సు మెటీరియల్‌ సహా సర్వం ఇస్రో భరిస్తుంది. 

Updated Date - 2020-02-13T05:56:33+05:30 IST