ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-08T04:46:07+05:30 IST

పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించి మోసంగించిన సంఘటనలో ఓ ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం
ప్రేమ విఫలమవటంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

- యువకుడిది ఆంరధ్రప్రదేశ్‌ రాష్ట్రం

- యువతిది మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ గ్రామం 

- ఇద్దరూ ఉద్యోగం చేసేది జడ్చర్ల సమీపాన ఫార్మా కంపెనీలో..

- పరిచయం, ప్రేమ, ఆ తర్వాత సహజీవనం

- కులాలు వేరుకావడంతో ఒప్పుకోని అబ్బాయి తల్లిదండ్రులు

- మనస్తాపంతో నిద్రమాత్రలు మింగిన ప్రియురాలు


కందుకూరు, మే 7 : పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించి మోసంగించిన సంఘటనలో ఓ ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వారి సామాజికవర్గాలు వేరైనందున పెద్దలు అంగీకరించక పోవడంతో మనస్తాపంతో ఆ యువతి అఘాయిత్యా నికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరులో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘ టన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా లింగస ముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంకు చెందిన మాల్యాద్రిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి బి.ఫార్మసీ పూర్తిచేసి జడ్చర్ల సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన దళిత యువతి కూడా బి.ఫార్మసీ పూర్తిచేసి అదే కంపెనీలో పని చే స్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని బ్రహ్మారెడ్డి నమ్మబలకటంతో వారిద్దరూ కొన్నినెలలు సహజీవ నం చేసినట్లు సమాచారం. ఇద్దరి కులాలు వేరు కావటంతో పెళ్లి చేసేందుకు ఆ యువకుడి తల్లిదం డ్రులు ఒప్పుకోలేదు. మా పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి సాధ్యమని, వారిని ఒప్పించే బాధ్యత నీవే తీసుకోవా లని ఆ యువతికి బ్రహ్మారెడ్డి చెప్పాడు. దీంతో ఆమె ఆరు నెలల క్రితం జడ్చర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు బ్రహ్మారెడ్డిని, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొంచెం సమయం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఆ యువకుడు తన ఉద్యోగాన్ని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరుకు మార్చుకుని ఆమెకు కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో నెలక్రితం ఆ యువతి నేరుగా తిమ్మారెడ్డిపాలెం చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామస్థులకు చెప్పటంతో పాటు బ్రహ్మారెడ్డి తల్లిదండ్రులను నిలదీ సింది. ఈ క్రమంలో ఆ యువకుడు మళ్లీ కొంతసమ యం ఇస్తే తమ తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పిం చి పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి సర్దిచెప్పి పంపాడు. దీనిపై పలు దళిత సంఘాలు, ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు కూడా జోక్యం చేసుకుని బ్రహ్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాట్లాడు కుందామని అందర్నీ పిలిపించారు. గురువారం ఆ యువతి బంధువులంతా కందుకూరు వచ్చారు. బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులు, అతని తరఫు పెద్దలు కూడా వచ్చారు. అందరి సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎంతోకొంత డబ్బు ఇస్తానని, పెళ్లి మాత్రం చేసుకునేది లేదని ఆ యువకుడు తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ యువతి మనస్తాపం చెంది అక్కడే ఆత్మహత్యాయత్నం చేయగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటంతో డిశ్చార్జి చేసుకుని ఆమె తరఫు వారు జడ్చర్లకు తీసుకెళ్లారు. జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైనందున అక్కడి నుంచే న్యాయపోరాటం చేస్తామని ఆ యువతి బంధువులు చెప్పారు.

Updated Date - 2021-05-08T04:46:07+05:30 IST