Abn logo
Sep 21 2021 @ 17:08PM

కదిరిలో పోలీసుల ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: జిల్లాలోని కదిరి పట్టణంలో పోలీసుల ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నపల్లికి చెందిన పవన్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణలు చేసింది. తనకు జరిగిన మోసంపై పోలీసులను బాధితురాలు రాజేశ్వరి, తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే  పవన్‌కుమార్‌కు మద్దతుగా పోలీసులు మాట్లాడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజేశ్వరిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption