Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ సీపీ ఆఫీస్‌ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

విజయవాడ: తనకు న్యాయం చేయాలని నగరంలోని సీపీ ఆఫీస్‌ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సులేమన్ అనే యువకుడితో యువతి అబిదా ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. అబీదాను పెళ్లి చేసుకోవడానికి సులేమన్‌ నిరాకరించాడు. దీంతో వేరే పెళ్లికి సిద్ధమైన ఆ యువతి సిద్ధమైంది. యువతి అబిదా ఫొటోలను  అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో తన స్నేహితుడు మౌలానా ఖురేషీతో కలిసి సులేమన్ పెట్టాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదును పోలీసుల పట్టించుకోలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. 

Advertisement
Advertisement