Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన టెక్నీషిన్.. చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : బాత్రూంలో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నిషియన్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మల్లెపల్లి ఇందిరానగర్‌కు చెందిన కె. మార్టిన్‌ ఇంటర్నెట్‌లో టెక్నిషియన్‌. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో ఇంటర్నెట్‌ పనిచేయకపోవడంతో మంగళవారం వచ్చాడు. పక్క ఇంట్లో ఓ మహిళ స్నానపు గదిలో ఉన్నట్టు గమనించాడు. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వద్ద ఉన్న రంధ్రం నుంచి సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీశాడు. గమనించిన మహిళ అరిచి, తన కుమారుడిని పిలిచింది. కుమారుడు, స్థానికులు వచ్చి మార్టిన్‌ పట్టుకున్నారు. అతని వద్ద సెల్‌ఫోన్‌ లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement